ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రకటనలు ప్రచురించ వద్దు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రకటనలను ప్రచురించరాదని ప్రచార, ప్రసార మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.  ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెబ్‌సైట్స్‌, ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రకటనలు వివిధ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌,

Published : 14 Jun 2022 04:05 IST

ప్రసార మాధ్యమాలకు కేంద్రం సూచన

ఈనాడు, దిల్లీ: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రకటనలను ప్రచురించరాదని ప్రచార, ప్రసార మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.  ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెబ్‌సైట్స్‌, ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రకటనలు వివిధ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సామాజిక, ఆన్‌లైన్‌ మీడియాల్లో ప్రత్యక్షమవుతున్నందున ఈ సూచనను జారీ చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. దేశంలో చాలాచోట్ల బెట్టింగ్‌, జూదం అన్నవి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలని, వాటి వల్ల వినియోగదారులకు సామాజిక, ఆర్థిక ముప్పు వాటిల్లుతోందని పేర్కొంది. ముఖ్యంగా యువత, పిల్లలు దీని బారినపడి నష్టపోతున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయని, వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం-2019, అడ్వర్టయిజింగ్‌ కోడ్‌ అండర్‌ ది కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌-1995, ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం 1978 కింద రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ఉండటం లేదని పేర్కొంది. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనను జారీ చేస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని