నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌

నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితాబ్‌కాంత్‌ పదవీకాలం ఈనెల

Published : 25 Jun 2022 06:07 IST

ఈనాడు, దిల్లీ: నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితాబ్‌కాంత్‌ పదవీకాలం ఈనెల 30వ తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య, గ్రామీణ తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిర్వహణ బాధ్యతలను ఈయనకు అప్పగించింది. దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో స్వచ్ఛంద పదవీ రమణ చేసి.. ప్రపంచబ్యాంకు చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ సీఈఓగా కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని