ఐబీ డైరెక్టర్‌గా తపన్‌కుమార్‌ డేకా

కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌

Published : 25 Jun 2022 03:22 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌ పదవీకాలం పూర్తికావడంతో డేకాను నియమిస్తూ నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. కొత్త డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. డేకా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఆపరేషన్స్‌ డెస్క్‌ బాధ్యతలు చూస్తున్నారు.

రా కార్యదర్శి పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
మరోవైపు రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) సెక్రెటరీగా పనిచేస్తున్న 1984 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సామంత్‌కుమార్‌ గోయల్‌ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఇలా ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని