Published : 25 Jun 2022 03:22 IST

రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడి

వయనాడ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ విధ్వంసం

వయనాడ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గ ఎంపీ రాహుల్‌ గాంధీకి చెందిన ఇక్కడి కల్‌పెట్టాలోని కార్యాలయంపై దాడి, దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం, కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అడిషనల్‌ డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కల్‌పెట్టా డీఎస్పీని సస్పెండ్‌ చేశారు. అటవీప్రాంతాల సమీపంలో బఫర్‌ జోన్లను ఏర్పాటు చేయడంలో రాహుల్‌ విఫలమయ్యారంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఇందుకు కారణమైంది. రాహుల్‌ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు లోపలికి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని, ఆ సమయంలో అక్కడ ఉన్న తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై దాడి చేశారని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ దాడిని ఖండిస్తూ హస్తం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఈ సందర్భంగా కొట్టాయం సహా పలు ప్రాంతాల్లో సీపీఎం, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని