17 వేలు దాటిన కొవిడ్‌ కేసులు

దేశంలో కొవిడ్‌ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. నాలుగు నెలల (124 రోజులు) తర్వాత తొలిసారి రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం 17 వేలు దాటింది. ఒక్కరోజులో ఏకంగా 30% కేసులు పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4%

Published : 25 Jun 2022 03:22 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. నాలుగు నెలల (124 రోజులు) తర్వాత తొలిసారి రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం 17 వేలు దాటింది. ఒక్కరోజులో ఏకంగా 30% కేసులు పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4% దాటిపోయింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 17,336 మంది వైరస్‌ బారిన పడగా.. 13 మంది కొవిడ్‌తో చనిపోయారు. క్రితం రోజుతో పోలిస్తే 4 వేలకు పైగా కేసులు పెరిగాయి.

‘కొవొవాక్స్‌’ అత్యవసర వినియోగానికి సిఫార్సు

7-11 ఏళ్ల పిల్లల కోసం అభివృద్ధి చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కొవొవాక్స్‌ కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం శుక్రవారం సిఫార్సు చేసింది. ఈమేరకు తుది అనుమతి కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి పంపించింది. ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతిని కోరుతూ ఎస్‌ఐఐ మార్చి 16న దరఖాస్తు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని