19 ఏళ్లు ఆ గరళాన్ని మోదీ భరించారు

గుజరాత్‌ అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను దగ్గరగా చూశానని చెప్పారు. ‘‘ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల మోదీ ఒక్క మాట మాట్లాడలేదు.

Updated : 26 Jun 2022 05:43 IST

గుజరాత్‌ అల్లర్ల అంశంపై అమిత్‌ షా వ్యాఖ్యలు

దిల్లీ: గుజరాత్‌ అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను దగ్గరగా చూశానని చెప్పారు. ‘‘ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల మోదీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిబ్బరంగా ఉండటం సాధ్యం’’ అని పేర్కొన్నారు. మోదీపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేశాయని అమిత్‌ షా ఆరోపించారు. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన కేసులో ఆయనకు సుప్రీం కోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. సిట్‌ విచారణను తాము ప్రభావితం చేయలేదని, సర్వోన్నత న్యాయస్థాన పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని చెప్పారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లనూ ఆయన ప్రస్తావించారు. ‘‘నాడు దిల్లీలో చాలామంది సిక్కులను చంపివేశారు. కానీ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. మేము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని వారు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు? నన్ను కూడా జైల్లో పెట్టారు. అయినా ఎలాంటి నిరసనలు జరగలేదు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కోర్టు కూడా చెప్పింది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని