జీ-7 సదస్సుకు మోదీ

జర్మనీలో ఆది, సోమవారాల్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న

Updated : 26 Jun 2022 05:46 IST

దిల్లీ: జర్మనీలో ఆది, సోమవారాల్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ సహా అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న జర్మనీ ఆహ్వానించిందని శనివారం ఓ ప్రకటనలో మోదీ తెలిపారు. సదస్సులో పాల్గొనే జీ-7, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పర్యావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. షోల్జ్‌ సహా సదస్సులో పాల్గొంటున్న పలు దేశాల నేతలతో ప్రత్యేక భేటీలకు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఐరోపాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులనూ కలవనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ఏడు ధనిక దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని శనివారం రాత్రి బయలుదేరివెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని