System Against Alcohal: డ్రైవర్‌ మద్యం సేవిస్తే.. బండి మొండికేస్తుంది!

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాహనం స్టార్ట్‌ అవకుండా చేసే ప్రత్యేక పరికరానికి ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ముగ్గురు ఇంజినీర్లు ప్రాణం పోశారు. కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌లో

Updated : 28 Jun 2022 08:22 IST

వాహనం స్టార్ట్‌ అవకుండా అడ్డుకొనే సరికొత్త వ్యవస్థ రూపకల్పన
భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ ఇంజినీర్ల ఘనత

ద్యం సేవించి డ్రైవింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాహనం స్టార్ట్‌ అవకుండా చేసే ప్రత్యేక పరికరానికి ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ముగ్గురు ఇంజినీర్లు ప్రాణం పోశారు. కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌లో పనిచేస్తున్న అజిత్‌ యాదవ్‌కు ఈ ఆలోచన తట్టింది. బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.. తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవడాన్ని చూసి ఆయన ఈ పరికరాన్ని తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తన స్నేహితులైన మనీశ్‌, సిద్ధార్థ్‌లతో కలిసి కార్యాచరణ ప్రారంభించారు. వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే భద్రతా వ్యవస్థను రూపొందించారు. ‘‘ఆల్కహాల్‌ సెన్సర్‌ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. వాహన చోదకుడు ఆల్కహాల్‌ సేవించాడో? లేదో? అనే విషయాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. డ్రైవర్‌ శ్వాసను విశ్లేషించి సెన్సర్‌కు ఆ సమాచారాన్ని పంపుతుంది. ఆల్కహాల్‌ ఆనవాళ్లు ఉంటే పరికరం డిస్ప్లేలో ఆ వివరాలు ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత బజర్‌ మోగుతుంది. ఆ సిగ్నల్‌ ఇంధన పంప్‌నకు చేరగానే సరఫరా నిలిచిపోతుంది. ఆల్కహాల్‌ సేవించినట్లు తేలితే.. వాహనం స్టార్ట్‌ అవకుండా అడ్డుకుంటుంది’’ అని అజిత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ పరికరాన్ని మరింతగా ఉన్నతీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని