భారత్‌లో విస్తరిస్తున్న నల్లమందు అమ్మకాలు: ఐరాస నివేదిక

మాదకద్రవ్యాల్లో ఒకటైన నల్లమందు వాడకందారుల సంఖ్య, అమ్మకాల పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటిగా భారత్‌ మారుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ నుంచి

Published : 28 Jun 2022 04:32 IST

దిల్లీ: మాదకద్రవ్యాల్లో ఒకటైన నల్లమందు వాడకందారుల సంఖ్య, అమ్మకాల పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటిగా భారత్‌ మారుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ నుంచి పెద్దఎత్తున సరకు మన దేశానికి వస్తున్నందువల్ల మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందని పేర్కొంది. మాదక ద్రవ్యాలు-నేరాలపై ‘ప్రపంచ మాదకద్రవ్య నివేదిక 2022’ను ఐరాస సోమవారం విడుదల చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 15-64 ఏళ్ల మధ్య వయసువారిలో 28.4 కోట్ల మంది ప్రజలు మాదకద్రవ్యాలను వినియోగించారని ఈ నివేదిక తెలిపింది. అంతకు ముందు దశాబ్దం కంటే ఇది 26% ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని