దిల్లీ విమానాశ్రయంలో ఫుల్‌ బాడీస్కానర్‌

దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-2లో ప్రయోగాత్మకంగా ‘ఫుల్‌ బాడీస్కానర్‌’ను ఏర్పాటు చేశారు. దీని పనితీరును మంగళవారం నుంచి పరిశీలించడం ప్రారంభించారు. ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ’ నిర్దేశించిన మేరకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌

Published : 29 Jun 2022 04:34 IST

 ప్రయోగాత్మకంగా ఏర్పాటు

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-2లో ప్రయోగాత్మకంగా ‘ఫుల్‌ బాడీస్కానర్‌’ను ఏర్పాటు చేశారు. దీని పనితీరును మంగళవారం నుంచి పరిశీలించడం ప్రారంభించారు. ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ’ నిర్దేశించిన మేరకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ స్కానర్‌ను ఏర్పాటు చేసింది. భద్రతా సిబ్బంది ప్రయాణికులను వ్యక్తిగతంగా తడిమి తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ స్కానర్‌ వారివద్ద ఉన్న అన్ని రకాల వస్తువులను గుర్తిస్తుంది. ప్రస్తుతం సంప్రదాయంగా ఉపయోగిస్తున్న డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌ గుర్తించలేని లోహేతర వస్తువులను (నాన్‌ మెటల్‌ ఆబ్జెక్టివ్స్‌) ఈ స్కానర్‌ కనిపెడుతుంది. దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని జీఎంఆర్‌ సంస్థ స్పష్టం చేసింది. వచ్చే 45-60 రోజుల పాటు దీని పనితీరును పరిశీలిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని