ముంబయిలో భవనం కూలి 19 మంది మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని కుర్లా ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి నాయక్‌ నగర్‌ సొసైటీలో ఓ నివాస భవనంలోని కొంత భాగం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది గాయపడ్డారు.

Published : 29 Jun 2022 04:34 IST

14 మందికి గాయాలు

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని కుర్లా ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి నాయక్‌ నగర్‌ సొసైటీలో ఓ నివాస భవనంలోని కొంత భాగం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్న 23 మందిని అధికారులు రక్షించారు. భవనంలోని మరో భాగం కూడా కూలిపోయే స్థితిలో ఉండడంతో.. అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తమవంతుగా ఆ కుటుంబాలకు రూ.5 లక్షలు అందించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని