అస్సాంలో మళ్లీ వర్షాలు... వరదలు విస్తరించే అవకాశం!

అస్సాంలో ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుండగా మళ్లీ భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర నది పొంగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 32 జిల్లాలను చుట్టుముట్టిన వరదలు

Published : 29 Jun 2022 05:20 IST

ఈనాడు, గువాహటి: అస్సాంలో ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుండగా మళ్లీ భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర నది పొంగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 32 జిల్లాలను చుట్టుముట్టిన వరదలు సోమవారం నాటికి 22 జిల్లాలకు తగ్గాయి. రాష్ట్రంలో పలుచోట్ల బ్రహ్మపుత్ర ఉద్ధృతి పెరుగుతుండటంతో వరదలు మళ్లీ విస్తరిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు గువాహటిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అస్సాం, మేఘాలయలకు మంగవారానికి రెడ్‌ అలెర్ట్‌, బుధ, గురువారాలకు ఆరెంజ్‌, శుక్ర, శనివారాలకు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 22 వరకు ఈశాన్య భారతంలో అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. మేఘాలయలో 203 శాతం, అస్సాంలో 171 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని