Train Toilets: రైళ్లలో మరుగుదొడ్ల పర్యవేక్షణకు బాధ్యులు

రైళ్లలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండటం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైళ్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించి మూల కారణం కనుగొనేందుకు సీనియర్‌ అధికారులకు రైల్వేశాఖ బాధ్యతలు అప్పగించింది. ఇదే క్రమంలో రెండోదశ

Updated : 29 Jun 2022 08:19 IST

దిల్లీ: రైళ్లలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండటం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైళ్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించి మూల కారణం కనుగొనేందుకు సీనియర్‌ అధికారులకు రైల్వేశాఖ బాధ్యతలు అప్పగించింది. ఇదే క్రమంలో రెండోదశ కింద రైల్వేబోర్డు స్థాయి అధికారులు 3ఏసీ కోచ్‌లలో రోజంతా ప్రయాణిస్తారు. వీరు ప్రయాణికుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు. ఈ ప్రక్రియకు వెంటనే శ్రీకారం చుట్టిన రైల్వే అధికారులు గత మూడు రోజుల్లో 544 మరుగుదొడ్ల పరిశీలన అపుడే పూర్తి చేశారు. సాధారణంగా ఈ పనులన్నీ జూనియర్‌ సిబ్బంది చేసేవారు. రైళ్లలో మరుగుదొడ్ల శుభ్రత సరిగా ఉండటం లేదని, నీరు ఉండటం లేదని, సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ సమీక్షించిన అధికారులు పై నిర్ణయాలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని