లక్షిత విమానం అభ్యాస్‌ పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హెచ్‌ఈఏటీ) విమానం ‘అభ్యాస్‌’ గగనతల పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరం చాందీపుర్‌లోని

Published : 30 Jun 2022 05:21 IST

బాలేశ్వర్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హెచ్‌ఈఏటీ) విమానం ‘అభ్యాస్‌’ గగనతల పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరం చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌)లో బుధవారం దీన్ని పరీక్షించారు. క్షిపణుల గగనతల పరీక్షల్లో లక్ష్యంగా వినియోగించడానికి వీలుగా డీఆర్డీవోలోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ విభాగం అభ్యాస్‌ను రూపొందించింది. ఐటీఆర్‌లో భూ ఆధారిత కంట్రోలర్‌ నుంచి ముందుగా నిర్దేశించిన, తక్కువ ఎత్తు ఉన్న మార్గంలో ఈ విమానం దూసుకెళ్లింది. రాడార్‌, ఎలక్ట్రో ఆప్టికల్‌ వ్యవస్థలు సహా, వివిధ సెన్సర్ల ద్వారా దీని పనితీరును పరిశీలించారు. ఈ విమానం స్వయం నిర్దేశితంగా పనిచేసేలా రూపొందించారు. అభ్యాస్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో, సైనిక బలగాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. అభ్యాస్‌ను రూపొందించి, అభివృద్ధి చేసిన బృందాలను డీఆర్డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని