రాష్ట్రపతి ఎన్నికలకు 115 నామినేషన్లు

వచ్చే నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి బుధవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తం 115 పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు.

Published : 30 Jun 2022 05:21 IST

ఈనాడు, దిల్లీ: వచ్చే నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి బుధవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తం 115 పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలిస్తారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని వాటిని తిరస్కరించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది.

కేరళ నుంచి సిన్హా ప్రచారం

తిరువనంతపురం: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా కేరళ నుంచి బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో భాజపాకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేకపోవడంతో ఇక్కడి నుంచి తనకు ఎక్కువ ఓట్లు దక్కుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఈమేరకు సిన్హా తిరువనంతపురంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి మద్దతు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని