ఏజీగా మరో 3 నెలలపాటు కె.కె.వేణుగోపాల్‌

సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌(91)ను భారత అటార్నీ జనరల్‌(ఏజీ)గా మరో మూడు నెలలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గురువారంతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో

Published : 30 Jun 2022 05:21 IST

నేటితో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

దిల్లీ: సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌(91)ను భారత అటార్నీ జనరల్‌(ఏజీ)గా మరో మూడు నెలలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గురువారంతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘జులై 1 నుంచి వేణుగోపాల్‌ నియామకం అమల్లోకి వస్తుంది. మరో మూడు నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు’’ అని న్యాయవ్యవహారాల విభాగం ఉత్తర్వుల్లో పేర్కొంది. వేణుగోపాల్‌ వ్యక్తిగత కారణాల వల్ల మళ్లీ ఏజీగా కొనసాగడానికి సుముఖంగా లేరని, అయితే ప్రభుత్వం అభ్యర్థించడంతో అంగీకరించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఏజీ పదవి చేపట్టిన అతిపెద్ద వయస్కుడిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. సాధారణంగా ఏజీ పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. 2017 జులైలో తొలిసారి ఏజీగా నియమితులైన వేణుగోపాల్‌ 2020 జూన్‌ వరకూ ఆ హోదాలో కొనసాగారు. ఆ తర్వాత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మరో ఏడాదిపాటు ఏజీ బాధ్యతలు నిర్వర్తించడానికి వేణుగోపాల్‌ అంగీకరించారు. 2021 జులైలో ప్రభుత్వం మరోసారి ఆయన్ను ఏడాది కాలానికి ఏజీగా నియమించింది. ఆ పదవీకాలం నేటితో ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని