విద్యను యజ్ఞంలా భావించే తరుణమిది

‘విద్యను యజ్ఞంగా భావించాల్సిన తరుణం వచ్చింది. దీన్ని విద్యారంగ ప్రముఖులు గుర్తించాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) విస్తరణలో భాగంగా బుధవారం చెన్నై

Published : 30 Jun 2022 05:21 IST

చెన్నై వీఐఎస్‌ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, చెన్నై: ‘విద్యను యజ్ఞంగా భావించాల్సిన తరుణం వచ్చింది. దీన్ని విద్యారంగ ప్రముఖులు గుర్తించాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) విస్తరణలో భాగంగా బుధవారం చెన్నై శివారు కీలంబాక్కం సమీప కయార్‌ గ్రామంలో వేలూరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (వీఐఎస్‌)ను ఆయన ప్రారంభించారు. ఇక్కడ  ఉపాధ్యాయులు విద్య మీదే దృష్టిపెట్టేలా వారి కుటుంబాలు కూడా క్యాంపస్‌లోనే నివాసం ఉండేలా చూడటం మంచి పరిణామమన్నారు. ఉన్నత విద్య బలోపేతానికి వీఐటీ కృషి చేస్తోందని వ్యవస్థాపకులు జి.విశ్వనాథన్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. పిల్లలు మాతృభాషను కచ్చితంగా నేర్చుకునేలా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని