Plastic Ban: నేటి నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్త నిషేధం శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి..తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ

Updated : 01 Jul 2022 07:10 IST

దిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్త నిషేధం శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి..తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కోరారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా, జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయన్నారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తారు. సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. నిషేధానికి సహకరించే పౌరుల సహాయార్థం ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని కూడా రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని