ఆర్థికరంగంలో దూసుకెళ్తున్న భారత్‌

‘రెండేళ్ల కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో నవ్యాలోచనల ఆవశ్యకత పెరిగింది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, సమీకృత సాంకేతిక వ్యవస్థల అవసరం అధికమైంది. ఈ అవసరాలకు అనుగుణంగా కేంద్రం హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం ఓ మైలురాయి.

Published : 01 Jul 2022 04:48 IST

బాష్‌ స్మార్ట్‌ క్యాంపస్‌ ఆవిష్కరణలో ప్రధాని

ఈనాడు, బెంగళూరు: ‘రెండేళ్ల కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో నవ్యాలోచనల ఆవశ్యకత పెరిగింది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, సమీకృత సాంకేతిక వ్యవస్థల అవసరం అధికమైంది. ఈ అవసరాలకు అనుగుణంగా కేంద్రం హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం ఓ మైలురాయి. దీనిని ప్రతి గ్రామానికీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన గురువారం బెంగళూరులో బాష్‌ స్మార్ట్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. యువ పారిశ్రామిక ఔత్సాహికుల సాయంతో భారత్‌ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చి దూసుకుపోతోందని అన్నారు. ‘జర్మనీకి చెందిన బాష్‌ ఇంజినీరింగ్‌ సంస్థకు భారత నైపుణ్యం తోడవటంతో ఈ సంస్థ స్థానిక యువతకు బహుముఖ విద్య, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను అందించగలుగుతోంది. 75 ఏళ్ల అమృత మహోత్సవం సందర్భంగా 25 ఏళ్ల ప్రణాళికలను సిద్ధం చేసుకొని వాటిని సాకారం చేసుకోవాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఎం బొమ్మై, బాష్‌ లిమిటెడ్‌ ఎండీ సౌమిత్ర భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. బాష్‌ స్మార్ట్‌ క్యాంపస్‌లో 85 శాతం సౌర, హరిత ఇంధనాన్ని వినియోగిస్తారు. మూడింట రెండొంతుల భాగం వాననీటిని వాడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని