మణిపుర్‌ ఘటనలో మరో 12 మృతదేహాలు

మణిపుర్‌ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో.. శుక్రవారం మరో 12 మృతదేహాలను సహాయ చర్యల బృందాలు వెలికితీశాయి. జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో

Published : 02 Jul 2022 04:46 IST

20కి పెరిగిన మృతుల సంఖ్య
మొత్తం 15 మంది జవాన్ల దుర్మరణం

ఇంఫాల్‌, ఈనాడు, గువాహటి: మణిపుర్‌ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో.. శుక్రవారం మరో 12 మృతదేహాలను సహాయ చర్యల బృందాలు వెలికితీశాయి. జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో గురువారం 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ మొత్తం మృతుల సంఖ్య 20కి పెరిగింది. వీరిలో 15 మంది ప్రాదేశిక సైన్యానికి చెందిన జవాన్లు, అయిదుగురు పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా 44 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో 15 మంది జవాన్లు, 29 మంది పౌరులు ఉన్నారని, సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని సైన్యం పేర్కొంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లలో 9 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తెలిపారు. అస్సాంకు చెందిన జవాను ఒకరు మృతిచెందారని, 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం మంత్రి పిజూష్‌ హజారికాను పంపినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని