సొమ్మును దాచేందుకు డీకే శివకుమార్‌ కుట్ర: ఈడీ

కోట్లాది రూపాయలను లెక్కల్లో చూపకుండా, పన్ను ఎగవేసేందుకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తన అనుచరులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారని ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి

Published : 02 Jul 2022 04:46 IST

దిల్లీ: కోట్లాది రూపాయలను లెక్కల్లో చూపకుండా, పన్ను ఎగవేసేందుకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తన అనుచరులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారని ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి కేసులో దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానానికి ఇటీవల దాఖలుచేసిన ఛార్జిషీట్‌లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 2017లో ఆదాయపన్ను విభాగం అధికారులు... శివకుమార్‌, ఆయనతో సంబంధాలున్న మరో నలుగురికి చెందిన దిల్లీలోని ప్రాంగణాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం రూ.8.59 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్‌ తదితరులు పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించారంటూ ఐటీ అధికారులు బెంగళూరు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈడీ కూడా దీనిపై దృష్టి సారించింది. డీకే శివకుమార్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని