6400 మంది యాత్రికులతో అమర్‌నాథ్‌కు మరో బృందం

అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహలో వెలిసే మంచులింగ దర్శనం గురువారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజుల్లోనే

Published : 02 Jul 2022 05:00 IST

జమ్మూ: అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహలో వెలిసే మంచులింగ దర్శనం గురువారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజుల్లోనే మంచులింగ దర్శనం కోసం తరలివెళ్లిన భక్తుల సంఖ్య 17,100కు చేరింది. శుక్రవారం 6,400 మంది భక్తులు వెళ్లారు. మరో ఏడు వేల మంది భక్తులు వెళ్లడానికి బేస్‌క్యాంపుల వద్ద సిద్ధంగా ఉన్నారు. తొలి రోజుల్లోనే యాత్రికులు ఇంత భారీ సంఖ్యలో వెళ్లడం గతంలో ఎన్నడూలేదని అధికారులు తెలిపారు. 2019లో యాత్రను కుదించడం, 2020, 2021లలో కొవిడ్‌ కారణంగా రద్దు చేయడంతో ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉందని భావిస్తున్నారు. ఏడీజీ ముఖేశ్‌సింగ్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. యాత్రికులతో అమర్‌నాథ్‌ వెళుతున్న జీపు శుక్రవారం జమ్ము-శ్రీనగర్‌ జాతీయరహదారిపై ప్రమాదానికి గురై ముగ్గురు గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని