రూ.235 కోట్ల ‘శరవణ’ ఆస్తుల స్తంభన

చెన్నై శరవణ స్టోర్స్‌ బంగారు మాళిగకు చెందిన రూ.235 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ అధికారులు శనివారం స్తంభింపజేశారు.

Published : 03 Jul 2022 06:32 IST

వేలచ్చేరి, న్యూస్‌టుడే: చెన్నై శరవణ స్టోర్స్‌ బంగారు మాళిగకు చెందిన రూ.235 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ అధికారులు శనివారం స్తంభింపజేశారు. దీంతోపాటు ప్రముఖ లాటరీ వ్యాపారి మార్టిన్‌కు చెందిన భూములు, బ్యాంకు ఖాతాల్లో నగదు సహా రూ.173 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో శరవణ నిర్వాహకులు, మార్టిన్‌ వేర్వేరుగా ఇండియన్‌ బ్యాంకులో రుణాలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని, ఈ కేసుల్లో భాగంగా వారి కార్యాలయాలుసహా, పలు ప్రాంతాల్లో ఐటీ విభాగం సోదాలు నిర్వహించిందని, లభించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, ఆస్తుల స్తంభన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు