5 వేల అడుగుల ఎత్తులో విమానంలో పొగలు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి తిరిగి సురక్షితంగా దిల్లీ చేరడంతో పెను ప్రమాదం తప్పింది.

Published : 03 Jul 2022 06:32 IST

వెనక్కు వచ్చిన దిల్లీ - జబల్‌పుర్‌ స్పైస్‌జెట్‌ సర్వీసు

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి తిరిగి సురక్షితంగా దిల్లీ చేరడంతో పెను ప్రమాదం తప్పింది. క్యూ400 ఎయిర్‌క్రాఫ్ట్‌ అయిదు వేల అడుగుల ఎత్తులో వెళుతున్నప్పుడు ఓ ఇంజిన్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ కావడంతో పొగలు వచ్చాయని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్పైస్‌జెట్‌ విమానాల్లో రెండు వారాల్లోనే ఇలాంటి ఘటనలు అయిదు జరగడంతో డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, వారిని మరో విమానంలో జబల్‌పుర్‌కు పంపినట్లు స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్నది వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని