ఉగ్రవాదులను నిర్బంధించిన గ్రామస్థులు

భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్‌ ఏ తయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ధైర్యంగా పట్టుకొని తమకు అప్పగించారని జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఇటీవల జరిగిన రాజౌరీ మందుపాతరల పేలుళ్ల సూత్రధారి తాలిబ్‌ హుసేన్‌

Published : 04 Jul 2022 05:06 IST

5లక్షల రివార్డు ప్రకటించిన జమ్మూ-కశ్మీర్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా

జమ్ము: భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్‌ ఏ తయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ధైర్యంగా పట్టుకొని తమకు అప్పగించారని జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఇటీవల జరిగిన రాజౌరీ మందుపాతరల పేలుళ్ల సూత్రధారి తాలిబ్‌ హుసేన్‌ కూడా ఇందులో ఉన్నట్లు వివరించారు. ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో ఉన్న  ఉగ్రవాదులను పట్టుకునేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన రియాసీ జిల్లా టక్సన్‌ధోక్‌ గ్రామస్థులను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, డీజీపీ దిల్‌బాగ్‌సింగ్‌ అభినందించారు. గ్రామానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రూ.5 లక్షలు, డీజీపీ రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ఉగ్రవాది తాలిబ్‌ హుసేన్‌ రాజౌరి జిల్లావాసి అని, మరొకరిని పుల్వామాకు చెందిన ఫైసల్‌ అహ్మద్‌దార్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరి వద్ద రెండు ఏకే రైఫిళ్లు, ఏడు గ్రనేడ్లు, పిస్టల్‌ తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని