Presidential Election: నెహ్రూ మద్దతు లేకుండానే ప్రథమ రాష్ట్రపతి పదవి
ఈనాడు, దిల్లీ: ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మద్దతు లేకపోయినా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి అయ్యారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారు. 1948లో ఆయన ఇంగ్లండ్ వెళ్లిపోవడంతో చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) ఆ పదవిలో నియమితులయ్యారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ జనరల్ స్థానంలో రాష్ట్రపతి ఉంటారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించేందుకు అప్పటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. ఫలితంగా రాజ్యాంగ సభ ద్వారానే రాష్ట్రపతిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఆ సభకు అధ్యక్షునిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతి పదవికి తొలి ఎంపికగా అంతా భావించారు. నెహ్రూ మాత్రం ప్రథమ రాష్ట్రపతిగా రాజాజీ ఉండాలని అభిలషించారు. రాజేంద్రప్రసాద్ ప్రగాఢమైన మత విశ్వాసాలున్న వ్యక్తి అనీ, రాష్ట్రపతి పదవికి ఆయన సరైన వ్యక్తి కాదని నెహ్రూ భావించారు.
లేఖతో మనస్తాపం
రాజాజీ రాష్ట్రపతి కావాలని తాను ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో ఉప ప్రధానమంత్రి వల్లభ్‌భాయ్ పటేల్‌తోనూ చర్చించినట్లు నెహ్రూ తనకు రాసిన లేఖతో రాజేంద్రప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. దానిపై నెహ్రూ, పటేల్‌లకు సుదీర్ఘ లేఖలు రాశారు. గౌరవంగా పక్కకు తప్పుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. తనతో చర్చించకుండానే నెహ్రూ తన పేరును వివాదంలోకి లాగుతున్నారని పటేల్ అసంతృప్తికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు ముగ్గురి నేతల మధ్య లేఖలు కొనసాగాయి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని రాజాజీ వ్యతిరేకించినందున ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిగా ఒప్పుకోబోమని రాజ్యాంగ సభ సభ్యులు, పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ముఖ్య నాయకులు తేల్చిచెప్పేశారు. వారంతా రాజేంద్రప్రసాద్ వైపే మొగ్గు చూపారు. రాజ్యాంగ సభ ఏకగీవ్రంగా ఎన్నుకోవడంతో రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రథమ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత 1952లో కె.టి.షాపైన, 1957లో చౌదరి హరిరామ్‌పైన భారీ మెజారిటీతో ఆయన రాష్ట్రపతిగా గెలిచారు. మొత్తంగా ఆ పదవిలో 12 సంవత్సరాలకు పైగా కొనసాగారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
-
Crime News
Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
Movies News
Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి