తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి: ఎ.రాజా

తమిళనాడును ప్రత్యేక స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా మార్చాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను డీఎంకే నేత ఎ.రాజా డిమాండ్‌ చేశారు. నామక్కల్‌లో జరిగిన పార్టీ

Published : 05 Jul 2022 03:49 IST

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడును ప్రత్యేక స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా మార్చాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను డీఎంకే నేత ఎ.రాజా డిమాండ్‌ చేశారు. నామక్కల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో తమ శ్రేణులకు సందేశాన్నిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును ప్రత్యేక దేశంగా మార్చాలనే డిమాండ్‌ వరకు తమను తీసుకెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. నామక్కల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలోనే రాజా ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యల్ని భాజపా వర్గాలు సోమవారం తీవ్రంగా ఖండించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని