Ragging: ఒడిశా శాసనసభను కుదిపేసిన ‘ర్యాగింగ్‌’!

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాల విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య, ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ ఉదంతాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని విపక్షాలు శాసనసభలో డిమాండు చేశాయి. సోమవారం సభాపతి బిక్రం కేసరి

Published : 05 Jul 2022 09:02 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాల విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య, ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ ఉదంతాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని విపక్షాలు శాసనసభలో డిమాండు చేశాయి. సోమవారం సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. హోంశాఖకు సంబంధించి ఆ శాఖ సహాయమంత్రి తుషార కాంతి బెహర సమాధానాలు చెబుతుండగా.. విపక్షాలు భాజపా, కాంగ్రెస్‌ సభ్యులంతా సభాపతి పోడియంవద్దకొచ్చి నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ సంఘటనలు పెరుగుతున్నాయని, యాంటీ ర్యాగింగ్‌ చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి దీనిపై ప్రత్యేక చర్చకు అనుమతించాలని భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి, కాంగ్రెస్‌ సభ్యుడు సురేష్‌ రౌత్రాయి డిమాండ్‌ చేశారు. రుచికా సంఘటనపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోరారు. శూన్యగంటలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని సభాపతి అరుక్‌ విపక్షాలను కోరినా వినకుండా పోడియం వద్దకు చేరి నినదించడంతో మధ్యాహ్నం వరకు కార్యక్రమాలను వాయిదా వేశారు. తర్వాత సభ కొలువుదీరినా పరిస్థితిలో మార్పు రాలేదు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని