Bhagwant mann: నేడు పంజాబ్‌ సీఎం పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (48) వివాహం గురువారం చండీగఢ్‌లో జరగనుంది. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ (32)ను ఆయన పెళ్లాడనున్నారు. ఈమె హరియాణాలోని పిహోవా ప్రాంత రైతు ఇందర్‌జిత్‌ సింగ్‌ కుమార్తె.

Updated : 07 Jul 2022 07:23 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (48) వివాహం గురువారం చండీగఢ్‌లో జరగనుంది. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ (32)ను ఆయన పెళ్లాడనున్నారు. ఈమె హరియాణాలోని పిహోవా ప్రాంత రైతు ఇందర్‌జిత్‌ సింగ్‌ కుమార్తె. మౌలానా వైద్య కళాశాలలో గోల్డ్‌ మెడలిస్ట్‌. రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఇటీవలి పంజాబ్‌ ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో ఈమె మాన్‌కు సహకరించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా సన్నిహిత వర్గాల సమాచారం. చండీగఢ్‌ సెక్టార్‌ 8లోని ఓ గురుద్వారాలో అత్యంత నిరాడంబరంగా, అతికొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ అతిథిగా హాజరు కానున్నారు. మాన్‌కు ఇదివరకే పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్ల క్రితం ఆయన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. మార్చి 16న పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణస్వీకారం చేసినపుడు ఆ వేడుకకు పిల్లలు సీరత్‌ (21), దిల్షాన్‌ (17) ఇద్దరూ హాజరయ్యారు.

* ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో సీఎం భగవంత్‌ మాన్‌ బుధవారం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్‌ కేబినెట్‌ విస్తరణ తర్వాత బుధవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ప్రజలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న నిర్ణయం ఆమోదం పొందింది. ఇక నుంచి పంజాబ్‌ ప్రజలకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు లభిస్తుందని మాన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని