Updated : 07 Jul 2022 10:28 IST

ఆ రాష్ట్రపతిది ప్రత్యేక శైలి.. తప్పులను ఎత్తిచూపడంలో అభిమానం అడ్డు రాలేదు!

రాష్ట్రపతుల్లో ఆర్‌.వెంకట్రామన్‌ది ఓ ప్రత్యేక శైలి. కాంగ్రెస్‌ పార్టీపైనా.. గాంధీల కుటుంబంపైనా ఆయనకు వల్లమాలిన అభిమానం. తప్పులను ఎత్తిచూపడానికి మాత్రం వెనుకాడేవారు కాదు. తాను కీలకమైన కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రి, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు చేపట్టడానికి కాంగ్రెస్‌ పార్టీ, గాంధీల కుటుంబమే కారణమన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందువల్లే ఇందిర, రాజీవ్‌ గాంధీలంటే ఆయనకు ఎంతో అభిమానం. తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. రాజీవ్‌ హయాంలో బోఫోర్స్‌ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాలు ఆయన రాజీనామాను డిమాండ్‌ చేశాయి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కూడా బోఫోర్స్‌ వ్యవహారాన్ని తప్పు పట్టింది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు పార్లమెంటు లోపలా, బయటా విపక్షాలపై ధ్వజమెత్తేవారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా మంత్రులు ‘కాగ్‌’పైనా అదే పనిగా విమర్శలు సంధించేవారు. అలాంటి సమయంలో.. ఇది సరైన విధానం కాదని వెంకట్రామన్‌ విస్పష్టంగా పేర్కొన్నారు. కాగ్‌ను విమర్శించడం తప్పని రాజీవ్‌కు, ఆయన అనుచరులకు కూడా చెప్పారు. రాజ్యాంగంలో విశిష్ట స్థానం ఉన్న కాగ్‌ను గౌరవించాలని సూచించారు. ఇలా సందర్భం వచ్చినప్పుడు తప్పును తప్పని చెప్పేందుకు వెంకట్రామన్‌ సంశయించే వారు కారు. రాజీవ్‌ మేలు కోరే తాను అలా చెబుతున్నాను తప్ప మరో ఉద్దేశం లేదని చెబుతుండేవారు. ‘మై ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ పుస్తకంలో వెంకట్రామన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని