Babri masjid: మళ్లీ తెరపైకి బాబ్రీ మసీదు విధ్వంసం కేసు

బాబ్రీ మసీదు విధ్వంసం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ, భాజపా సీనియర్‌ నేత ఎం.ఎం.జోషి సహా 32 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన సమీక్ష పిటిషన్‌పై సోమవారం

Updated : 19 Jul 2022 07:27 IST

ఆడ్వాణీ సహా 32 మందిపై ప్రారంభం కానున్న విచారణ

లఖ్‌నవూ: బాబ్రీ మసీదు విధ్వంసం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ, భాజపా సీనియర్‌ నేత ఎం.ఎం.జోషి సహా 32 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన సమీక్ష పిటిషన్‌పై సోమవారం అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ కీలక ఉత్తర్వులిచ్చింది. దీన్ని సమీక్ష పిటిషన్‌గా కాకుండా క్రిమినల్‌ అప్పీలుగా పరిగణించి విచారిస్తామని పిటిషనర్లకు తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది. అయోధ్యకు చెందిన హాజీ మహమూద్‌, సయ్యద్‌ అఖలాక్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. డిసెంబర్‌ 6, 1992న బాబ్రీమసీదును కర సేవకులు ధ్వంసం చేశారు. సెప్టెంబర్‌ 30, 2020న ప్రత్యేక సీబీఐ కోర్టు.. ఈ కేసులో నిందితులైన ఆడ్వాణీ, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, సీనియర్‌ భాజపా నేతలు ఎం.ఎం.జోషి, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌ తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది. విధ్వంసం సమయంలో పత్రికల్లో వచ్చిన వార్తలను, వీడియో క్లిప్పులను ఆధారాలుగా నమ్మడానికి ట్రయల్‌ కోర్టు జడ్జి నిరాకరించారు. వీటికి సంబంధించిన ఒరిజనల్స్‌ (మూలప్రతులు)ను సమర్పించలేదంటూ కేసును కొట్టివేశారు. కరసేవకులతో నిందితులు సమావేశమైనట్లు కూడా సీబీఐ నిరూపించలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని