IT Returns: ఆఖరి రోజున 68 లక్షల ఐటీ రిటర్నులు

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు ఆఖరి రోజైన ఆదివారం ఒక్కరోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలైనట్లు ఐటీ

Updated : 01 Aug 2022 13:36 IST

దిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు ఆఖరి రోజైన ఆదివారం ఒక్కరోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలైనట్లు ఐటీ విభాగం వెల్లడించింది. శనివారం వరకు 5.10 కోట్లకు పైగా దాఖలైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 11 గంటల వరకు చూస్తే ఈ సంఖ్య దాదాపు 5.78 కోట్లకు చేరింది. గడువు ముగిసేందుకు మరో గంట సమయమున్నందున, ఇంకో 5 లక్షల వరకు దాఖలవ్వొచ్చని భావిస్తున్నారు. అంటే దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు కావచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పొడిగించిన గడువు తేదీ 2021 డిసెంబరు 31 వరకు చూస్తే దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గడువు పొడిగించనందున 6 లక్షల మంది జరిమానాతో ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి వస్తుంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 19.53 లక్షలు దాఖలయ్యాయి. తదుపరి ప్రతి గంటకు 4 లక్షలకు పైగా.. సాయంత్రం 5-6 గంటల మధ్య అత్యధికంగా 5.17 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

అపరాధ రుసుముతో: 2021-22కు సంబంధించి అపరాధ రుసుము లేకుండా జులై 31లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయాలి. తదుపరి డిసెంబరు 31 వరకు అపరాధరుసుముతో దాఖలు చేయొచ్చు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000, అంతకుమించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి, ఐటీఆర్‌ దాఖలు చేయాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని