అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్నాం

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకం కోసం లాంఛనాలను పూర్తిచేస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. నిబంధనలు, సంప్రదాయాల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ కచ్చితంగా ఉంటున్నందున..

Published : 06 Aug 2022 04:16 IST

తదుపరి సీజేఐ నియామకంపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వ్యాఖ్య

దిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకం కోసం లాంఛనాలను పూర్తిచేస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. నిబంధనలు, సంప్రదాయాల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ కచ్చితంగా ఉంటున్నందున.. అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. దిల్లీలోని పార్లమెంటు భవనం వద్ద శుక్రవారం కిరణ్‌ రిజుజు విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయమై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలన్న విషయమై పేరును సూచిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నుంచి లేఖ అందినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని