Published : 06 Aug 2022 04:16 IST

బిహార్‌లో నాటుసారాకు 11 మంది బలి

కంటిచూపు కోల్పోయిన కొందరు

ఛాప్రా(బిహార్‌): మద్య నిషేధం అమలులో ఉన్న బిహార్‌లో నాటుసారా అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. సారణ్‌ జిల్లా మాకర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో నాటుసారా తాగి 11 మంది మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో దాదాపు 25 మంది కంటి చూపు కోల్పోయారని గ్రామస్థులు చెబుతున్నారు. వీరంతా నకిలీ మద్యాన్ని ఎప్పుడు సేవించారన్న విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులు ఎవరూ చెప్పేందుకు సిద్ధపడటం లేదు. ‘‘ప్రాథమికంగా వీరంతా నకిలీ మద్యం సేవించినట్లుగా ఉంది’’ అని జిల్లా కలెక్టర్‌ రాజేశ్‌ మీనా తెలిపారు. ఛాప్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారని, పట్నా మెడికల్‌ కాలేజీకి తరలిస్తుండగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని