Published : 06 Aug 2022 05:11 IST

భారత్‌లో పర్యటించిన చైనా ప్రత్యేక దూత షియోంగ్‌

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో చైనా ప్రత్యేక దూత యూ షియోంగ్‌ చడీచప్పుడు లేకుండా ఈ వారం భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు వీలున్న అవకాశాలపై భారత సీనియర్‌ అధికారులతో చర్చించారు. విదేశీ వ్యవహారాల శాఖలో అఫ్గానిస్థాన్‌కు సంబంధించి పాయింట్‌ పర్సన్‌గా ఉన్న జేపీ సింగ్‌తో షియోంగ్‌ చర్చలు జరిపినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్‌ యీ దిల్లీలో పర్యటించిన నాలుగు నెలల అనంతరం తాజా పర్యటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు, షియోంగ్‌ తొలి భారత పర్యటన ఇదే కావడం విశేషం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts