వీసా గడువు ముగిసినా వీడలేదు

వీసా గడువు ముగిసినప్పటికీ 2020 నాటికి 40 వేల మంది విదేశీయులు భారత్‌లో ఉండిపోయారు. 2019లో వీరి సంఖ్య 54,576గా ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. అక్రమంగా ఉన్నవారికి అయిదేళ్ల

Published : 06 Aug 2022 05:11 IST

భారత్‌లోనే ఉండిపోయిన 40 వేల మంది విదేశీయులు: కేంద్ర హోంశాఖ

దిల్లీ: వీసా గడువు ముగిసినప్పటికీ 2020 నాటికి 40 వేల మంది విదేశీయులు భారత్‌లో ఉండిపోయారు. 2019లో వీరి సంఖ్య 54,576గా ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. అక్రమంగా ఉన్నవారికి అయిదేళ్ల వరకు జైలు శిక్షలతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని.. దేశంలోకి మళ్లీ రాకుండా నిషేధం కూడా విధించవచ్చని అధికారులు తెలిపారు. వీసా గడువు ముగిసిన నాటి నుంచి 15 రోజుల వరకు జరిమానా ఉండదు. 16 నుంచి 30 రోజుల మధ్య వారికి రూ.10 వేలు, 31 నుంచి 90 రోజుల మధ్య వారికి రూ.20 వేలు, 90 రోజులు దాటితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. కొవిడ్‌-19 కారణంగా దేశంలో దీర్ఘకాలం లాక్‌డౌన్‌ విధించినప్పటికీ 2020 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబరు 31 వరకు 32.79 లక్షల మంది విదేశీయులు భారత్‌లో పర్యటించారు. వీరిలో అమెరికాకు చెందిన వారు అత్యధికంగా 61,190 మంది ఉండగా.. తరువాతి స్థానంలో బంగ్లాదేశీయులు 37,774, బ్రిటన్‌ వారు 33,323, కెనడా వారు 13,707, పోర్చుగల్‌ వారు 11,668 మంది ఉన్నారు. జర్మనీ జాతీయులు 8,438 మంది, ఫ్రెంచ్‌ వారు 8,353 మంది, ఇరాక్‌కు చెందిన వారు 7,163, కొరియా నుంచి 6,129, పాకిస్థాన్‌ జాతీయులు 4,751 మంది భారత్‌లో పర్యటించారు. వాస్తవానికి కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి చెందిన తరువాత దేశంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. విదేశీ పర్యాటకుల వీసాల జారీపై ఆంక్షలు అమలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని