దేవతల చిత్రీకరణపై అభ్యంతరం.. వారపత్రికపై కేసు

వారపత్రికలో ఓ వ్యాసం కోసం ప్రచురించిన చిత్రంలో శివుడు, కాళీమాతలను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని హిందూవాద కార్యకర్తల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కాన్పుర్‌ పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. ఈ

Published : 06 Aug 2022 05:11 IST

వ్యాసకర్తగా తప్పుకొన్న వివేక్‌ దేబరాయ్‌

కాన్పుర్‌ (యూపీ): వారపత్రికలో ఓ వ్యాసం కోసం ప్రచురించిన చిత్రంలో శివుడు, కాళీమాతలను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని హిందూవాద కార్యకర్తల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కాన్పుర్‌ పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో కలత చెందిన వ్యాసకర్త, ఆర్థికవేత్త వివేక్‌ దేబరాయ్‌ ఆ పత్రికతో తన అనుబంధానికి స్వస్తి పలికారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర భాజపా మాజీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పత్రిక సంపాదకుడు, యాజమాన్యంపై ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలైంది. శుక్రవారం కాన్పుర్‌లోని బడా చౌరాహాలో భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘అగ్ని నాలుక’ పేరుతో జులై 24 సంచికలో ప్రచురితమైన ఆ వాసకర్త వివేక్‌ దేబరాయ్‌ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆ చిత్ర ప్రచురణపై పత్రిక యాజమాన్యం తన వెబ్‌సైటులో విచారం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని