యూపీలో విషపూరిత గ్రాసం తిని 60 ఆవుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆవులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విచారణకు

Published : 06 Aug 2022 05:11 IST

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆవులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విచారణకు ఆదేశించారు. పశుసంవర్థక శాఖ మంత్రి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్య కార్యదర్శి, లైవ్‌స్టాక్‌ డైరెక్టర్‌, మొరాదాబాద్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. అమ్రోహా జిల్లా సంతల్‌పుర్‌ గోశాలలో మొత్తం 188 ఆవులు ఉన్నాయి. బుధవారం కొందరు కూలీలు తోటలోని మేత కోసి గ్రాసంగా వేయడంతో గురువారం ఉదయం నుంచి వాటికి అస్వస్థత మొదలైంది. మధ్యాహ్నం ఒక ఆవు చనిపోగా.. ఆ తర్వాత వాటి మరణాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా కొన్ని గంటల్లోనే 55 ఆవులు మృతి చెందాయి. ఇప్పుడు వాటి సంఖ్య 60కి చేరింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీడీవోను డీఎం సస్పెండ్‌ చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ గోశాల వద్దకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని