‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా ఎస్‌కేఎం ప్రచారోద్యమం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈనెల 7వ తేదీన దేశవ్యాప్త ప్రచారోద్యమాన్ని ప్రారంభించనున్నట్లు రైతు సంఘాలకు చెందిన సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) శనివారం

Published : 07 Aug 2022 05:13 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈనెల 7వ తేదీన దేశవ్యాప్త ప్రచారోద్యమాన్ని ప్రారంభించనున్నట్లు రైతు సంఘాలకు చెందిన సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) శనివారం వెల్లడించింది. సైనిక దళాల్లోకి తమ యువతను పంపుతున్న రైతు కుటుంబాలకు ఈ పథకం పెద్దదెబ్బ అని పేర్కొంది. మాజీ సైనికోద్యోగుల యునైటెడ్‌ ఫ్రంట్‌తో పాటు వివిధ యువజన సంఘాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్‌కేఎం ఓ ప్రకటనలో తెలిపింది. సైన్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రచారోద్యమంలో తొలి అడుగుగా ఈనెల 7 నుంచి 14 వరకు ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ సదస్సులను నిర్వహిస్తున్నట్లు స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని