Published : 07 Aug 2022 05:13 IST

సచ్ఛీలత నిరూపణకు.. న్యాయాధికారులు నార్కో పరీక్షలు చేయించుకోవాలి

కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణభట్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులు స్వచ్ఛందంగా నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేయించుకోవాలని కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పి.కృష్ణభట్ వ్యాఖ్యానించారు. హైకోర్టు జడ్జిగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఆయనకు.. న్యాయవాదులు, న్యాయమూర్తుల సంఘం శనివారం వీడ్కోలు సభ నిర్వహించింది. ఇందులో జస్టిస్‌ భట్‌ మాట్లాడుతూ ‘ఇటీవల పలువురు న్యాయమూర్తులు, లోకాయుక్త, ఉప లోకాయుక్త, ఉన్నత స్థానాల్లోని ఇతర అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా వారికి చట్టబద్ధంగా రావాల్సిన పదోన్నతులు ఆలస్యమవుతున్నాయి. వారికి, న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, స్వచ్ఛందంగా నార్కో పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా వారి సచ్ఛీలత బయటపడుతుంది’ అని పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ నిబంధనలకు కట్టుబడి ఇచ్చే తీర్పులను న్యాయమూర్తులు విడిచిపెట్టాలని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయంలో తనకు స్వాగతం చెప్పేందుకు రాలేదని ఒక జిల్లా న్యాయమూర్తిపై హైకోర్టు జడ్జి ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి ఫిర్యాదు చేయడాన్ని గుర్తుచేశారు. సర్వాధికార ధోరణి అనుసరించే న్యాయమూర్తులు ఉన్నత స్థానాల్లో కొనసాగేందుకు అనర్హులని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని