అవినీతి వ్యాపారులకే ఉచిత తాయిలాలు

అయిదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నందుకే ప్రధానికి పేదలు కృతజ్ఞతలు చెప్పాలని ఈ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదే సర్కారు గత అయిదేళ్లలో అవినీతి వ్యాపారులకు చెందిన రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసినట్లు చెబుతోంది. ప్రభుత్వ

Updated : 07 Aug 2022 06:50 IST

వరుణ్‌ గాంధీ

యిదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నందుకే ప్రధానికి పేదలు కృతజ్ఞతలు చెప్పాలని ఈ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదే సర్కారు గత అయిదేళ్లలో అవినీతి వ్యాపారులకు చెందిన రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసినట్లు చెబుతోంది. ప్రభుత్వ ‘ఉచిత తాయిలాలు’ పొందిన వారిలో వారే ముందున్నారు. 


ప్రభుత్వం అంత అంధకారంలో ఉందా?

ప్రియాంకా గాంధీ

సాంకేతిక సమస్యల కారణంగా 50 వేల మంది విద్యార్థులు విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీయూఈటీ) రాయలేకపోయారు. ఇంతటి విధాన వైఫల్యాల పర్యవసానాలనూ చూడలేనంత అంధకారంలో ప్రభుత్వం ఉందా? ఈ దేశ యువతకు ఎందుకీ శిక్ష?     


విచారణలో ఉన్న ఖైదీల్లో పేదలే అత్యధికులు

పి.చిదంబరం

జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం.. దేశంలో జైళ్లలో గడుపుతున్నవారిలో 76 శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలే. వారిలో 21 శాతం మంది నిరక్షరాస్యులు. అంటే విచారణ ఖైదీల్లో అత్యధికులు పేదవారు, అణగారిన వర్గాలవారే అని స్పష్టమవుతోంది. మన న్యాయ వ్యవస్థ వక్రీకరణకు గురైంది. పేదలు మాత్రమే విచారణ, బెయిలు లేకుండా జైళ్లలో మగ్గుతున్నారు.


ద్రవ్యోల్బణ తగ్గింపు దిశగా మరో అడుగు

బైడెన్‌

ద్రవ్యోల్బణం, అమెరికా కుటుంబాలకు ఖర్చులను తగ్గించే దిశగా ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టంతో మా ప్రభుత్వం మరో అడుగు వేసింది. వైద్యులు సూచించిన ఔషధాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై డబ్బును ఆదా చేయడానికి ఇది దోహదపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని