పార్టీ నిర్ణయాన్ని కాదని.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎందుకు పాల్గొన్నారు?

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో ఎందుకు పాల్గొన్నారంటూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ శిశిర్‌ అధికారిని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌ వివరణ కోరారు. ఈమేరకు శిశిర్‌కు శనివారం లేఖ రాశారు. ఉప

Published : 07 Aug 2022 05:39 IST

శిశిర్‌ అధికారిని వివరణ కోరిన టీఎంసీ

దిల్లీ/కోల్‌కతా: ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో ఎందుకు పాల్గొన్నారంటూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ శిశిర్‌ అధికారిని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌ వివరణ కోరారు. ఈమేరకు శిశిర్‌కు శనివారం లేఖ రాశారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు గైర్హాజరు కావాలని పార్టీ నిర్ణయించినప్పటికీ ఎందుకు పాల్గొన్నారని లేఖలో ప్రశ్నించారు. కాగా ఎవరైనా పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారంటే వారు భాజపాకు దగ్గరవుతున్నట్లేనని టీఎంసీ పశ్చిమబెంగాల్‌ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోఝ్‌ కోల్‌కతాలో పేర్కొన్నారు. టీఎంసీతో శిశిర్‌ అధికారి సంబంధాలు క్రమేపీ బలహీనపడ్డాయి. పార్టీలో ఉంటూ ఆయన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. శిశిర్‌ కుమారుడు, ఎంపీ దివ్యేందు అధికారి కూడా ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్నారు. శిశిర్‌ మరో కుమారుడు సువేందు అధికారి పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని