కడుపులో స్టీల్‌ గ్లాస్‌.. శస్త్రచికిత్సతో బయటికి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఎక్స్‌రే తీయగా.. అతడి శరీరంలో గ్లాసు ఉన్నట్లు కనిపించింది. దీంతో శస్త్రచికిత్స నిర్వహించి

Published : 07 Aug 2022 05:39 IST

త్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఎక్స్‌రే తీయగా.. అతడి శరీరంలో గ్లాసు ఉన్నట్లు కనిపించింది. దీంతో శస్త్రచికిత్స నిర్వహించి అతడి కడుపులో నుంచి గ్లాసును బయటకు తీశారు. జౌన్‌పుర్‌ జిల్లాలోని గోత్వా భటౌలీ గ్రామానికి చెందిన సమరనాథ్‌.. కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యుడు లాల్‌ బహదూర్‌ వద్దకు వెళ్లాడు. సుమారు గంటపాటు వైద్యబృందం శ్రమించి సమరనాథ్‌ కడుపులో నుంచి స్టీల్‌ గ్లాసును బయటకు తీశారు. ‘‘స్టీల్‌ గ్లాసు నోటి ద్వారా కడుపులోకి వెళ్లిందని సమరనాథ్‌ చెప్పాడు. కానీ నోటి ద్వారా గ్లాసు కడుపులోకి వెళ్లే అవకాశం లేదు. కచ్చితంగా మలద్వారం నుంచే కడుపు లోపలికి వెళ్లి ఉంటుంది’’ అని లాల్‌ బహదూర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని