ఆ ముగ్గురు వైద్యుల్ని పట్టిస్తే నగదు బహుమతి

భద్రతా చర్యల్లో వైఫల్యం కారణంగా, ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మధ్యప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు వైద్యులు, ఓ సీనియర్‌ మేనేజర్‌

Published : 07 Aug 2022 05:39 IST

మధ్యప్రదేశ్‌ పోలీసుల ప్రకటన

జబల్‌పుర్‌: భద్రతా చర్యల్లో వైఫల్యం కారణంగా, ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మధ్యప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు వైద్యులు, ఓ సీనియర్‌ మేనేజర్‌ సమాచారం తెలియజేస్తే రూ.పది వేల చొప్పున బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. జబల్‌పుర్‌లోని న్యూ లైఫ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం అనంతరం డాక్టర్‌ సంతోష్‌ సోనీ, అసిస్టెంట్‌ మేనేజర్‌ రామ్‌సోనీలను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆసుపత్రి యజమాని డాక్టర్‌ నిశిత్‌ గుప్తా, డాక్టర్‌ సురేష్‌పటేల్‌, డాక్టర్‌ సంజయ్‌పటేల్‌, సీనియర్‌ మేనేజర్‌ విపిన్‌పాండేల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ్‌ బహుగుణ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అగ్ని ప్రమాద నిరోధక చర్యలు, ఇతర భద్రతా ప్రమాణాలు పాటించని 28 ప్రైవేట్‌ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసినట్లు ముఖ్య వైద్యారోగ్యశాఖ అధికారి(సీఎంహెచ్‌వో) డాక్టర్‌ సంజయ్‌మిశ్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని