పంజాబ్‌ జైళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్‌..

పంజాబ్‌లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా జైళ్లకు సరఫరా అవుతున్నాయి. ఫరీద్‌కోట్‌ జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్‌ టెస్ట్‌లు నిర్వహించగా 1,064 మంది డ్రగ్స్‌ వాడుతున్నట్లు తేలింది. వారిలో కొందరు

Published : 07 Aug 2022 05:39 IST

పంజాబ్‌లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా జైళ్లకు సరఫరా అవుతున్నాయి. ఫరీద్‌కోట్‌ జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్‌ టెస్ట్‌లు నిర్వహించగా 1,064 మంది డ్రగ్స్‌ వాడుతున్నట్లు తేలింది. వారిలో కొందరు మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. పంజాబ్‌ జైళ్లలో ఖైదీలకు మాదక ద్రవ్యాల సరఫరా నిరాటంకంగా సాగుతోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో జైళ్లలో డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని పంజాబ్‌ సర్కారు ఆదేశించింది. ఖైదీల్లో డ్రగ్స్‌ వినియోగం మాన్పించేందుకు పంజాబ్‌ సర్కారు ఎప్పటి నుంచో జైళ్లలో ఒక కేంద్రం ఏర్పాటు చేసింది. ఇంతమంది ఖైదీలు.. మాదక ద్రవ్యాలు వాడుతున్నప్పుడు ఆ కేంద్రం ఉపయోగమేమిటనే విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో దొరికినవారిని కూడా డ్రగ్స్‌ మాన్పించే కేంద్రంలో చికిత్స అందిస్తామని సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ సంజయ్‌ కపూర్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని