Published : 07 Aug 2022 05:39 IST

ఎర్రకోట మైదానంలో రామలీలా ఉత్సవాలు

దసరా నవరాత్రులకు ఘనంగా సన్నాహాలు

దిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా నవరాత్రుల సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట మైదానంలో రామలీలా ఉత్సవం అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. కొవిడ్‌ మహమ్మారి విరుచుకుపడిన తరవాత ఇంత భారీగా ఉత్సవం నిర్వహించడం ఇదే ప్రథమమని లవకుశ రామలీలా కమిటీ తెలిపింది. వేడుకల కోసం మైదానంలో మూడు అంతస్తుల రంగస్థలం, దానిపై 70 అడుగుల అయోధ్య రామమందిర నమూనా నిర్మిస్తున్నారు. ముంబయి, కోల్‌కతా, లఖ్‌నవూ, మధుర, బృందావనం నుంచి వచ్చిన వాస్తు శిల్పులు ఈ పన్నుల్లో నిమగ్నమయ్యారు. రంగస్థలంపై కైలాస పర్వత నమూనా, వనవాస దృశ్యాలు ప్రదర్శితమవుతాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది రామలీల ఉత్సవాలను అత్యంత ఘనంగా జరపాలని నిశ్చయించారు. దసరానాడు 100 అడుగుల ఎత్తైన రావణ, 90 అడుగుల ఎత్తైన కుంభకర్ణ, 80 అడుగుల ఎత్తైన ఇంద్రజిత్తు బొమ్మలను దహనం చేస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముస్లిం కళాకారులు ఈ బొమ్మలను రూపొందిస్తున్నారు. రంగస్థలంపై రామాయణ నాటక ప్రదర్శనలో 250 మంది స్థానిక కళాకారులు, 30 మంది ముంబయి కళాకారులు పాల్గొంటారని రామలీలా కమిటీ సభ్యులు తెలిపారు. వీరికి బాలీవుడ్‌ స్టంట్‌ మెన్‌ తర్ఫీదు ఇస్తున్నారు. గతంలో రంగస్థలం ముందు 25,000 మంది ప్రేక్షకులకు సీట్లు ఏర్పాటు చేసే వాళ్లమనీ, ఈసారి 40,000 మంది కూర్చోవడానికి వీలుగా వసతులు కల్పిస్తున్నామని నిర్వహణ కమిటీకి చెందిన అర్జున్‌ కుమార్‌ చెప్పారు. రంగస్థలంపై ఎల్‌ఈడీ లైట్లు అమరుస్తున్నామనీ, త్రీడీ ఎఫెక్ట్స్‌ వినియోగిస్తున్నామనీ తెలిపారు. ఈ ఏడాది రామలీల సందర్భంగా మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ వివరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని