రద్దైన ‘సీయూఈటీ-యూజీ’ పరీక్షల షెడ్యూల్‌ వాయిదా

సాంకేతిక, ఇతర కారణాలతో గత వారం జరిగిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-యూజీ’ను రాయలేని విద్యార్థుల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కొత్త షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 24-28 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని

Published : 08 Aug 2022 05:45 IST

ఆగస్టు 24-28 మధ్య నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటన

దిల్లీ: సాంకేతిక, ఇతర కారణాలతో గత వారం జరిగిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-యూజీ’ను రాయలేని విద్యార్థుల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కొత్త షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 24-28 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అడ్మిట్‌ కార్డులను పరీక్షకు ముందు జారీ చేస్తామని తెలిపింది. ‘‘రెండో దశలో షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 4 నుంచి 6 మధ్య పరీక్ష నిర్వహించాం. సాంకేతిక, పరిపాలన కారణాలతో కొన్ని కేంద్రాల్లో పరీక్ష వాయిదా పడింది. దీంతో ఆగస్టు 12 నుంచి 14 మధ్య జరుపుతామని ఇంతకుముందు పేర్కొన్నాం. అయితే ఈ తేదీల్లో పండుగలు ఉన్నాయని, అనుకూలం లేవని చాలా మంది విద్యార్థులు విజ్ఞప్తి చేయడంతో తాజా తేదీలను ప్రకటించాం’’ అని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. మరోవైపు కొన్ని కేంద్రాల్లో సీయూఈటీ-యూజీ పరీక్ష నిర్వహణ విషయంలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ కేంద్రాల్లో పరీక్షలు రద్దు చేశామని ఆదివారం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని