పది విమానాశ్రయాల్లో దుబాసీలు, ప్రత్యేక డెస్కులు

దేశంలో వైద్య పర్యాటకానికి ఊతమిచ్చే ‘భారత్‌లో స్వస్థత’ (హీల్‌ ఇన్‌ ఇండియా) కార్యక్రమానికి కేంద్రం..మరింత మెరుగులు దిద్దుతోంది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వైద్య పర్యాటకులు ఎక్కువగా

Published : 08 Aug 2022 05:45 IST

దిల్లీ: దేశంలో వైద్య పర్యాటకానికి ఊతమిచ్చే ‘భారత్‌లో స్వస్థత’ (హీల్‌ ఇన్‌ ఇండియా) కార్యక్రమానికి కేంద్రం..మరింత మెరుగులు దిద్దుతోంది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వైద్య పర్యాటకులు ఎక్కువగా వస్తున్న పది విమానాశ్రయాలను గుర్తించి.. వాటి ప్రాంగణాల్లో విదేశీ రోగులు, వారి సహాయకుల కోసం దుబాసీలను, ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాల్లో దిల్లీ, ముంబై, చెన్నై ,హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, విశాఖపట్నం, కోచి, అహ్మదాబాద్‌, గువహటి ఉన్నాయి. విదేశీ రోగుల కోసం.. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బహుభాషా పోర్టల్‌నూ అభివృద్ధి చేస్తోంది. వైద్య పర్యాటకుల వీసా నిబంధనలనూ సరళతరం చేయాలని భావిస్తోంది. వీటన్నింటిని ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని