స్పైస్‌జెట్‌ విమాన ప్రయాణికుల నడకబాట

విమానం దిగిన తర్వాత టెర్మినల్‌కు చేరుకునేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నడకబాట పట్టిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానమొకటి హైదరాబాద్‌ నుంచి

Published : 08 Aug 2022 05:45 IST

టెర్మినల్‌కు చేరేందుకు బస్సులు లేకపోవడంతో..

దిల్లీ: విమానం దిగిన తర్వాత టెర్మినల్‌కు చేరుకునేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నడకబాట పట్టిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానమొకటి హైదరాబాద్‌ నుంచి 186 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి దాదాపు 11:24 గంటలకు దిల్లీ చేరుకుంది. విమానం ల్యాండ్‌ అయిన దగ్గరి నుంచి ప్రయాణికులు టెర్మినల్‌కు చేరుకునేందుకు ఆ సమయంలో ఒకే ఒక్క బస్సు అందుబాటులో ఉంది. మిగిలినవారు దాదాపు 45 నిమిషాల పాటు వేచి ఉన్నా వేరే బస్సులేవీ రాలేదు. దీంతో వారిలో చాలామంది టెర్మినల్‌ వైపు నడకబాట పట్టాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్పైస్‌జెట్‌ స్పందిస్తూ.. బస్సుల రాక కొంత ఆలస్యమైన మాట వాస్తమేనని పేర్కొంది. అయితే నడక ప్రారంభించిన ప్రయాణికులు సహా అందరినీ తాము తిరిగి బస్సులో ఎక్కించుకొని టెర్మినల్‌కు చేర్చినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానాయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని