Drone: మనిషిని మోసుకెళ్లే డ్రోన్‌

మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌

Updated : 09 Aug 2022 07:00 IST

మూడేళ్లలో ఎయిర్‌ ట్యాక్సీలు సిద్ధం!

పుణె: మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్‌ను తయారుచేసింది. తాజాగా దీని పనితీరును ప్రదర్శించింది. ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ డ్రోన్‌.. 130 కిలోల బరువు మోయగలదు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది. మనుషుల రవాణాకూ ఈ డ్రోన్‌ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువ. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్‌ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్‌ను ఎయిర్‌ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్‌ బబ్బర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని